అమలాపురం చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు
పయనించే సూర్యుడు ఆగస్ట్ 23 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) అమలాపురం చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి 71వ పుట్టిన రోజు వారోత్సవాలు నల్లా చిట్టిబాబు,ఏడిద శ్రీను,నల్లా నాయుడు,ఆధ్వర్యంలో ఈ రోజు 20.8.2026 గురువారం ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో చిరంజీవి గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు జరిపించారు,అనంతరం అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ మంగాదేవి గారు చేతుల మీదుగా హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు,మరియు అయినవిల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై జ్యోతి వారి చేతుల మీదుగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది,అనంతరం చిరంజీవి యువత ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవ కార్యక్రమాలను అభినందించారు.ఈ సేవ కార్యక్రమంలో మెగా ఫోర్స్ జిల్లా అధ్యక్షుడు సుధా చిన్న, సలాధి బుచ్చిరాజు,చిక్కం బాలాజీ, పడాల గిరి,నల్లా చిన్ని, దాట్ల బాబు,మద్దాల చంటి, సుందర నేడి యేసుబాబు,అడపా భూషణం, దామిశెట్టి గాంధీ,అమర నానాజీ , భీమల చిన్న,తోట బాబి,అబ్బిరెడ్డి యుగంధర్,దామిశెట్టి రాంబాబు మరియు మెగా అభిమానులు పాల్గొనారు