టేకులపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా సామూహిక శ్రీమంతాలు – చిన్నారులకు అక్షరాభ్యాసం
పయనించె సూర్యుడు ఫిబ్రవరి 26(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి, మండల పరిధిలోని టేకులపల్లి గ్రామ పంచాయతీ అంగన్‌వాడీ కేంద్రం వేదికగా ఈరోజు మాతృత్వానికి గౌరవం,విద్యా వికాసానికి ప్రాధాన్యతనిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ బోడ బాలు నాయక్ మరియు సెక్టార్ సూపర్వైజర్ కె. అనురాధ ఆధ్వర్యంలో ఆరుగురు గర్భిణీ స్త్రీలకు వైభవంగా సామూహిక శ్రీమంతాలు నిర్వహించగా,ఐదుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాబుద్ధులకు శ్రీకారం చుట్టారు.మాతృత్వానికి మంగళ హారతులు:శ్రీమంతాల వేదికపై ఆరుగురు గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా గాజులు […]




