ఆక్వా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం : ఎంపీ హరీష్ బాలయోగి
ప య నించు సూర్యుడు జూలై 22 ముమ్మడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)ఆక్వా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు.ఆక్వా మేతల ధరలు తగ్గించే చర్యలపై ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ “లల్లన్ సింగ్” తో చర్చించినట్లు తెలిపారు.కేంద్ర మంత్రులతో చర్చలుఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఇతర ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.ముడి పదార్థాల ధరలపై చర్చఈ సందర్భంగా ఎంపీ హరీష్ బాలయోగి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ రంగం అభివృద్ధికి అత్యంత కీలకమైన ఆక్వా మేత ధరలను తగ్గించాల్సిన అవసరంపై చర్చించామన్నారు. ప్రధానంగా ఆక్వా మేతలకు ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులపై గణనీయమైన భారం పడుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి వ్యయాలను స్థిరీకరించడానికి మరియు ఈ రంగానికి మరింత స్థిరమైన ధరల విధానాన్ని నిర్ధారించడానికి గల సంభావ్య చర్యలపై సమావేశంలో చర్చించామన్నారు.ఆక్వా రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ హరీష్ స్పష్టం చేశారు.