భీంగల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముమ్మరంఅదనపు కలెక్టర్ సమీక్ష..

July 22, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు D.22.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.త్వరలో 2 వేల పెండింగ్ ఓట్ల నమోదు పూర్తి
భీంగల్, D. 22:7.2026భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ 7కార్యక్రమం పురోగతిపై అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు అందించారు.కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఉప తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భీంగల్ మండలంలో సుమారు 2 వేల ఓట్లకు సంబంధించిన నమోదు, అనుబంధ ఫారాల పరిశీలన ప్రక్రియ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.అధికారులు మాట్లాడుతూ, రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఓలు (బూత్ లెవల్ అధికారులు) మరియు రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు కూడా అవసరమైన పత్రాలతో సహకరించి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

🌐 Select Language:
📰 ePaper