PS Telugu News
Epaper

ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కుడలిలో మైనార్టీల హక్కుల కోసం మౌన దీక్ష.

📅 31 Dec 2025 ⏱️ 6:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా,ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కుడలిలో జేఏసీ కమిటీ కన్వీనర్ బీరువాల భాష మాట్లాడుతూ వారితోపాటు సామాజిక, రాజకీయ, సంఘాలా ఆధ్వర్యంలో,నాలుగు రోడ్ల కుడలిలో మౌన దీక్ష నిర్వహించారు.భారత్,బంగ్లాదేశ్లలో మైనార్టీలపై హింసను ఖండిస్తూ, న్యాయవ్యవస్థలో సంస్కరణలు, మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శాంతి సమాన హక్కుల కోసం ఐక్యంగా పోరాడుతామని ప్రజా సంఘాలు కులసంఘాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకుడు జిల్లా ఇన్చార్జి చంద్రశేఖర్,నంద్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ ఎర్రమల చక్రవర్తి, మండల ఉపాధ్యక్షుడు బద్రి ప్రసాద్, ఎస్.డి. పి.ఐ పార్టీ నాయకుడు ఫక్రుద్దీన్, సిరివెళ్ల జేఏసీ నాయకుడు నిజాముద్దీన్, నూర్ భాషా, ఆళ్లగడ్డ జేఏసీ నాయకుడు బైక్ మెకానిక్ నూర్ భాషా, దస్తగిరి ఆళ్లగడ్డ కన్వీనర్ మూల ప్రభాకర్ వీరితోపాటు అధిక సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు.

Scroll to Top