ఇచ్చిన మాట నిలబెట్టుకున్న,వందర్ గుట్ట తండా,సర్పంచ్ రేణుక బాలునాయక్
//పయనించే సూర్యుడు //న్యూస్ డిసెంబర్ 31// నారాయణపేట జిల్లా బ్యూరో //
గతవారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలకు,ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సర్పంచ్ రేణుక బాలు నాయక్, నారాయణపేట మండలం,వందర్ గుట్ట తండా,సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించిన,రేణుక బాలునాయక్ గ్రామంలో ఆడబిడ్డ పుడితే 2000 చొప్పున, మగబిడ్డ పుడితే 1000 రూపాయలు చొప్పున ఇస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది, అనుకున్నట్టుగానే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో, రేణుక బాలునాయక్ విజయం సాధించడం జరిగింది,ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, వందర్ గుట్ట తండా గ్రామానికి చెందిన సంగీత బాలునాయక్ దంపతులకు,ఈరోజు నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డ పుట్టడం జరిగింది, విషయం తెలుసుకున్న సర్పంచ్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం,ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, సంగీత బాలునాయక్ దంపతులకు,1000 రూపాయల నగదును అందజేయడం జరిగింది,ఈ సందర్భంగా ప్రజలు సర్పంచ్ రేణుక బాలునాయక్ ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డందుకు,వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, భవిష్యత్తులో ఇలాగే కొనసాగాలని గ్రామాన్ని అభివృద్ధి, వైపు, పయనించేలా కృషి చేయాలని,వారిని కోరారు అలాగే గ్రామ ప్రజలు, యువత, మాట్లాడుతూ,గెలిచిన తర్వాత మాటతప్పే నాయకులు ఉన్న,ఈ రోజుల్లో చెప్పిన మాట ప్రకారం మాట ఇచ్చి నిలబెట్టుకున్నందుకు సర్పంచు రేణుక బాలు నాయకులను అభినందిస్తున్నారు,ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్ నాయక్, గ్రామ యువకులు, గణేష్ నాయక్, చంద్య నాయక్, నరసింహ నాయక్ బలరాం నాయక్, గ్రామ ప్రజలు యువకులు, నాయకులు పాల్గొన్నారు
