తెలంగాణ

నాగేంద్రనగర్ లో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ.

నాగేంద్రనగర్ లో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ.

పయనించే సూర్యుడుD.22.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.ఎర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామానికి చెందిన మార్క పర్షగౌడ్‌కు రూ.22,500 విలువైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కును బుధవారం అందజేశారు.యూనియన్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ డీసీసీబీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ చెక్కు మంజూరైంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందె రంజిత్ చేతుల మీదుగా మార్క పర్షగౌడ్‌కు చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్లూరి సాంసన్ కార్యకర్తలు బొల్లి దావీదు, జంగా దామోదర్, షేక్ జమాలుద్దీన్, బొడరాజు, జంగా కుర్పాల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినందుకు మానాల మోహన్ రెడ్డి కి మార్క పర్షగౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS