ఉపాధ్యాయ సమస్యల సాధనకైఆగస్టు 1న తపస్ మహాధర్నా

July 23, 2026 | సినిమా వార్తలు

: పయనించే సూర్యుడు జూలై 23 మక్తల్ :ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధన కోసం ఆగస్టు 1న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మక్తల్ దగ్గర మక్తల్ మండల విద్యాధికారి శ్రీ అమీరుద్దీన్ గారి చేతుల మీదుగా మహాధర్నా గోడపత్రిక ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రవీందర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న సమస్యల సాధన కోసం అనేకసార్లు విన్నవించిన ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే దశల వారి ఉద్యమ కార్యాచరణకు పిలుపు ఇవ్వడం జరిగిందని తెలిపారు.పిఆర్సి వెంటనే ప్రకటించాలని,ఆరు డీఏలు విడుదల చేయాలని,సిపిఎస్ విధానం రద్దు పరిచి పాత పెన్షన్ అమలు చేయాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని,కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటిఎస్ అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ తో ఈ మహాధర్న చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రతి మహాధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య గౌడ్, నాగేశ్వరయ్య, నాగార్జున తపస్ జిల్లా నాయకులు వెంకట్ రాములు, మక్తల్ మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ కుమార్, మండల బాధ్యులు ప్రవర్ధన్, రాజంజనేయులు,అనిల్ రెడ్డి,రవీందర్ రెడ్డి, మదన్, జగదీశ్, ధన్సింగ్, కమలాకర్, నరసింహ, రాములు,తపస్ ప్రాథమిక సభ్యులు తదితర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper