రవీంద్రసూరికి సినారె సాహితీ పురస్కారం

July 23, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు న్యూస్ జులై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన కవి, సినీ దర్శకుడు నామాల రవీంద్రసూరికి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి (సినారె) స్మారక సాహితీ పురస్కారం ప్రకటించారు.మహాకవి సినారె 95వ జయంతిని పురస్కరించుకొని సినారె కళాపీఠం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్ హాల్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సినారె కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములు వెల్లడించారు.ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేసిన ఎంపిక కమిటీ సభ్యులకు, సినారె కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములు కి రవీంద్రసూరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన వ్యక్తిగత విజయంగా కాకుండా సాహిత్యానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper