PS Telugu News
Epaper

ఎంజెపిసి ఆధ్వర్యంలో ఉమెన్ డెవలప్మెంట్ సెంటర్లో ఘనంగా చలివేంద్రం ప్రారంభం కెవి నరసింహ

📅 23 Apr 2026 ⏱️ 7:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 24మక్తల్

గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నారాయణ పేట జిల్లా మాగనూర్ మండలం కొల్పూర్ గ్రామంలో ఉమెన్ డెవలప్మెంట్ సెంటర్లో ఎంజెపివిసి ఆధ్వర్యంలో చలివేంద్రం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోల్పూర్ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎం జె పి వి సి ఆధ్వర్యంలో ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు ముందు చేయాలని కొన్ని ఆడారు అలాగే ఉమెన్ డెవలప్మెంట్ సెంటర్ సూపర్వైజర్ మహాదేవి మాట్లాడుతూ ఎం జె పి వి సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చలివేంద్ర కార్యక్రమం మా సెంటర్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కొని ఆడారు అలాగే స్వామి గౌడ్ మాట్లాడుతూ ఎం జె పి వి సి అనేది రానున్న కాలంలో గ్రామాల నుండి మండలం జిల్లా రాష్ట్ర స్థాయి దేశస్థాయిలో విస్తరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మన్న మాట్లాడుతూ ఎం జె పి వి సి చాలా మంచి కార్యక్రమాలు చేస్తుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులకు శాలువాలతో సన్మానిస్తూ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం జె పి వి సి వ్యవస్థాపక అధ్యక్షులు కేవి నరసింహ కోల్పూర్ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నహిర పవిత్ర ఉమెన్ డెవలప్మెంట్ సెంటర్ సూపర్వైజర్ మహదేవి పుట్టి వెంకటేష్ తిరుమలేష్ స్వామి గౌడ్ శేఖర్ మోసిన్ గాయిత్రి వార్డ్ మెంబెర్ శిరీష శంకర్ రాధికా తదితరులు పాల్గొని చలివేంద్రం ప్రారంభం కార్యక్రమం విజవంతం చేశారు.

Scroll to Top