ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వీరులకు పాదాభివందనం

June 25, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు జూన్ 25 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి, పౌర హక్కులను కాలరాసిన ఎమర్జెన్సీని దేశం ఎప్పటికీ మరవదు: మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా దేశంలో 1975 జూన్ 25న విధించిన అప్రజాస్వామిక ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం త్యాగాలు చేసిన వీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా అన్నారు. ఎమర్జెన్సీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పి. గన్నవరం మండలంలోని ముంగండ గ్రామంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు తిక్క సత్యనారాయణ అధ్యక్షతన అభినందన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయ్యాజీ వేమా, ఎమర్జెన్సీ కాలంలో అరెస్టుకు గురైన ముంగండ గ్రామానికి చెందిన కీర్తిశేషులు నడిమింటి నాగరాజారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణి శ్రీమతి నడిమింటి భ్రమరాంబ ని, మరో ఎమర్జెన్సీ వీరుడు శ్రీ ముక్కామల వెంకట శాస్త్రి ని శాలువాలతో సత్కరించి గౌరవించారు.ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ, 1975 జూన్ 25 భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ, పౌర హక్కులను హరించిన ఎమర్జెన్సీ దేశ ప్రజలపై మోపిన అత్యంత దుర్భరమైన కాలమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నాలను దేశ ప్రజలు ధైర్యంగా ఎదుర్కొని, తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని చెప్పారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగిన ఆ ఉద్యమంలో ముంగండ గ్రామానికి చెందిన వీరులు కూడా భాగస్వాములు కావడం గ్రామ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడిన మహనీయుల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు చెరుకూరి గోపాలకృష్ణ, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మేడిది సత్యనారాయణ, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వరరావు, మాజీ జిల్లా కార్యదర్శి అడ్డాల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ, ఖండవిల్లి శ్రీనివాస్ దీక్షితులు, గంట్రోతు పల్లపురాజు, ర్యాలీ సత్యనారాయణ, మట్టపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper