ఎరుగట్ల మండలంలోని కేజీ బీవీ స్కూల్లో ఆరోగ్య శిబిరం లో పాల్గొన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రక్షిత.

August 4, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.4.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలంలోఈరోజు మంగళవారం రోజున ఏరగట్ల మండలంలోని కేజీబీవీ స్కూల్లో ఆరోగ్యం శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థినులకు జ్వరం జలుబు దగ్గు తలనొప్పి ఇతర వ్యాధులకు డాక్టర్ రాసిన మందులు ఇవ్వడం జరిగింది మరియు ఆరోగ్య విద్య బోధన వ్యక్తిగత శుభ్రత వర్షాకాలంలో వచ్చే వ్యాధులు మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా ఇతర వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రక్షిత మేడం చెప్పడం జరిగింది మరియు మరియు హెచ్ పి వి వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రక్షిత హెచ్ ఈ ఓ మొతిరం హెచ్ ఎస్ విజయ ఎస్ ఓ సంధ్య హెల్త్ అసిస్టెంట్ పండరి కస్తూరిబా ఏఎన్ఎం త్రివేణి ఏఎన్ఎం కల్పన స్వప్న ఆశలు భారతి నవ్య సులోచన పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper