బొడ్డువానిలంక అభివృద్ధికి సహకరించాలని వినతి

August 4, 2026 | తెలంగాణ

పయ నించే సూర్యుడు ఆగస్టు 4 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)తాళ్లరేవు మండలం కోరంగి, బొడ్డువానిలంక గ్రామాల ప్రజలు తమ గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి మరియు ఇతర మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గ్రామస్తులు అందించిన వినతిపత్రాన్ని సానుకూలంగా పరిశీలించి, బొడ్డువానిలంక గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపట్టేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సుంకర పావని, తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ, బిజెపి యనమండ్ర విజయకుమార్ కూటమి ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper