కడియాలకుంట తండాలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

September 17, 2026 | సినిమా వార్తలు

సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ ఆధ్వర్యంలో వేడుకలు

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 18 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తండ సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17న వచ్చిందని తెలంగాణకు స్వాతంత్రం రావడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ తో పాటు ఉపసర్పంచ్ తావు సింగ్ నాయక్, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం, వార్డు సభ్యులు తావు సింగ్, ప్రియాంక దేవేందర్, దేవి రవి నాయక్, నీలా భాస్కర్ నాయక్, చాట్ పాట రవీందర్, గోపి నాయక్, జ్యోతి రాజు నాయక్ కారోబార్ రవీందర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper