గిరిజన రిజర్వేషన్ల పెంపునకు నాలుగేళ్లు
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కడియాల కుంట తండా గ్రామ కమిటీ అధ్యక్షులు చాట్ పాట రవీందర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 18 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ కమిటీ అధ్యక్షులు చాట్ పాట రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ..గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమలో కడియాలకుంట తండా బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చాట్ పాట రవీందర్,మూడవత్ వినోద్, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, మల్లేష్ నాయక్, పండు నాయక్,సందీప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు