సి.సి కెమెరాల నిఘాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు గణేష్ నిమజ్జనానికి వటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లుచేశాము: పోలీస్ కమీషనర్ వెల్లడి.

September 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.17.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు వరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్, బోధన్ డివిజన్ వరిధిలో గణేష్ మండపాల పై పోలీసుల నిఘా వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., తెలియజేశారు.గత నాలుగు రోజుల క్రితం ప్రారంభమయిన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాలతో పాటు వాటి పరిసరా ప్రాంతాల్లోను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు కార్యచరణ ప్రణాళికతో పోలీస్ కమీషనరేటు వరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు పోలీస్ భద్రత కల్పించడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ తెలియజేశారు.నిజామాబాద్ కమీషనరేటు వరిధి లో మొత్తం 5681 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నిజామాబాద్ డివిజన్ వరిధి లో 2545 విగ్రహాలు. ఆర్మూర్ డివిజన్ వరిధిలో 1959 విగ్రహాలు, బోధన్ డివిజన్ పరిధిలో 1177 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలకు భద్రత కల్పించడం కోసం వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది.
ఆన్ లైన్ ద్వారా గణేష్ మండపాల రిజిస్ట్రేషన్ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే దిశగా విగ్రహాల ఏర్పాటుకు అవసరమయిన పోలీస్ అనుమతుల కై గణేష్ నవరాత్రి నిర్వహాకులు సంబంధిత పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఆన్లైన్ విధానం ద్వారా ధరఖాస్తు చేసుకున్న గణేష్ నవరాత్రి నిర్వహాకుల కు విగ్రహా ఏర్పాటుకు స్థానిక పోలీసులు అనుమతులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు.24 గంటలు బ్లూకోర్డ్స్ సిబ్బంది పర్యవేక్షణ
ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు కల్పిస్తున్న భద్రతలో భాగంగా సేక్టార్ వారిగా విధులు నిర్వహించే బ్లూ కోర్ట్ మరియు పెట్రో కార్ సిబ్బంది ప్రతిరోజు మూడు షిఫ్టుల వారిగా మూడు పర్యాయాలు మండపాలను సందర్శించి అక్కడి పరిస్థితులపై అధ్యాయం చేస్తూ భద్రత విషయంలో నిర్వాహకులకు సూచనలు చేస్తూ మండపాల వారిగా జారీ చేసినా పాయింట్ బుక్కు లో సెక్టార్ పోలీసు సిబ్బంది సంతకము చేయడం జరుగుతుంది.నిమజ్జనానికి సి.సి కెమెరాల ఏర్పాట్లునిజామాబాద్ పోలీస్ కమీషనరేటు వరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలలో సి.సి కెమోరాల ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ లో ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్ లో దాదావు 100 సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెమెరాలు ఐ.పి టెక్నాలజీ తో రూపోందించడం జరిగింది. ఈ కెమెరాలు పూర్తిగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగింది. ఈ సి.సి టివిలు 24 X 7 ప్రకారంగా వూర్తిగా సిబ్బంది వర్యవేక్షణలో ఉంటుంది.

🌐 Select Language:
📰 ePaper