కడియాల కుంట తండా పాఠశాలలో సామూహిక అక్షరభ్యాసం

June 20, 2026 | తెలంగాణ

అంగన్వాడి ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట

ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్

పాల్గొన్న వార్డు సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు

( పయనించే సూర్యుడు జూన్ 21 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ అన్నారు. ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా పాఠశాల ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ టీచర్లు గ్రామ సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ ఆధ్వర్యంలో శనివారం బడిబాట మరియు సామూహిక అక్షరభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.అమ్మ మాట అంగన్వాడి బాట కడియాల కుంట తండా లోనే అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ సుజాత ఆధ్వర్యంలో సామూహిక అక్షరభ్యాసం మరియు పాఠశాల దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కడియల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ మాట్లాడుతూ… ప్రభుత్వ అందిస్తున్న ఉచిత విద్య మరియు మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను వినియోగించుకోవాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్. పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్, సురేశ్ ఉప సర్పంచ్ తావు సింగ్, మరియు వార్డు సభ్యులు చాట్ పాట రవీందర్, తావు సింగ్, సేవాలాల్ యూత్ అధ్యక్షుడు శ్రీను నాయక్,అంగన్వాడీ టీచర్ సుజాత, వివో అధ్యక్షురాలు రాత్లావత్ మాన్ని మరియు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper