10 కోట్ల 50 లక్షల నిధులతో గ్రామాల్లో గోదాముల నిర్మాణంముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ముధోల్ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో రైతాంగానికి ఇబ్బందులు కలుగకుండా పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి ముధోల్ నియోజకవర్గం లోని 35 గ్రామాల్లో ఒక్కో దానికి 30 లక్షల రూపాయల నిధులతో గోదాములను నిర్మించడానికి నిధులు మంజూరు చేయించారు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్. 10 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో ఈ పనులు జరగనున్నాయి. ముధోల్ నియోజకవర్గం లో గతంలో ఎన్నడు లేనివిధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత పది సంవత్సరాల పాలకుల పాలనలో నియోజక వర్గం వెనుక పడగా, ఎమ్మెల్యే పటేల్ ప్రత్యేక దృష్టి సాధించడంతో పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బాసర మండలంలోని టాక్లి, కిర్గుల్ కే, బైంసా మండలంలోని బిజ్జూర్, వానలపాడ్, మహాగాం, కుంసర, ఇలేగామ్, కుబీర్ మండలంలోని పార్ది బి, పార్ది కే, పల్సి, హంపోలి, కుంటాల మండలంలోని లింబకే, లింబా బి, విట్టాపూర్, పెంచికల్ పాడ్, ఓలా, లోకేశ్వరం మండలంలోని ధర్మోరా, పిప్రి, అబ్దుల్లాపూర్, కనకాపూర్, నరసింహనగర్ తాండ, ముధోల్ మండలంలోని గన్నోరా, ముద్గల్, బోరిగాం, అష్ట, రాంటేక్, నర్సాపూర్ మండలంలోని తిమ్మాపూర్, డోంగు ర్ గావ్, నందన్, తానూర్ మండలం లోని బోరిగావ్ బామ్ని, బొంద్రట్, భోసి, బెల్ తరోడా, గ్రామాల్లో గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి.