కమలాపూర్ ఆదర్శంగా నిలుస్తుంది కమలాపూర్ ఎం పి డి ఓ గుండె బాబు

August 1, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కమలాపూర్: ఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుధ్య పరిరక్షణ చర్యలు, మొక్కలు నాటే కార్యక్రమాలతో కమలాపూర్ గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని కమలాపూర్ ఎం పి డి ఓ గుండె బాబు అన్నారు. స్వచ్ఛ కమలాపూర్‌ లక్ష్యంగా కమలాపూర్ గ్రామ పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో 15 వ వారం ఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలక మండలి, సిబ్బంది, వైద్యులు, వైద్య శాఖ సిబ్బందితో కలిసి ఎం పి డి ఓ కమలాపూర్ సిహెచ్ సి (ప్రభుత్వ ఆస్పత్రి) ఆవరణలో శ్రమదానంలో పాల్గొన్నారు. ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, గడ్డి శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపిటివో మాట్లాడుతూ కమలాపూర్ గ్రామపంచాయతీ పాలకమండలి తుం ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి శనివారం శ్రమదానం చేస్తూ గ్రామాన్ని బాగు చేసుకోవడంతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. గ్రామాల్లో జనాభాకు సరిపడా సిబ్బంది లేకపోవడం నిధుల గురక కారణంగా వారిశుధ్యం పేర్కొన్న నేపథ్యంలో ఇలా గ్రామస్తులు భాగస్వాములను చేసి వారిశుధ్య పరిరక్షణ చర్యలు చేపట్టడం శుభసూచకం అన్నారు. కమలాపూర్ గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తింపు తెచ్చుకునే అంతవరకు అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. హాస్పిటల్ సూపరిండెంట్ చందు నాయక్ మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో గ్రామపంచాయతీ సర్పంచ్ పాలకమండలి సభ్యులు శ్రమదానంతో శుభ్రం చేయడం సంతోషంగా ఉంది ఇంతకాలం పేరుకుపోయిన చెత్తాచెదారం శుభ్రమై పిచ్చి మొక్కలు తొలగించడంతో ఆసుపత్రి ఆవరణ చాలా శుభ్రంగా మారింది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం మంచి పరిణామం అన్నారు. సర్పంచ్ పంపు సతీష్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల శ్రమ విలువను గ్రామస్తులకు తెలియజే సి గ్రామస్తులను పారిశుద్ధ్య పరిరక్షణ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యాలు చేయడమే ఊరు కోసం ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి నాగరాజు, వాటి సభ్యులు ఎండబెల్లి మల్లారెడ్డి, ఆవునూరి తిరుపతి, పుల్ల ఐలయ్య, నాయకులు అశోక్, నోటం సంపత్, తుమ్మ రాజేష్, బైరీ రాజేష్ పచ్చిమట్ల కుమారస్వామి, చేనుమల్ల రంజిత్, వైద్యులు వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper