కమ్మదానంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

June 9, 2026 | సినిమా వార్తలు

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్థులు

( పయనించే సూర్యుడు జూన్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం కమ్మదానం గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన రెండు హైమాస్ట్ లైట్లను నిన్న సోమవారం రాత్రి ప్రజాప్రతినిధుల మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.హైమాస్ట్ లైట్లు ఏర్పాటు వల్ల గ్రామంలో భద్రత పెరగడంతో పాటు రాత్రి సమయంలో ప్రజల రాకపోకలకు సౌలభ్యం కలుగుతుందని అన్నారు.తమ గ్రామానికి ఉపయోగపడే ప్రజాప్రయోజన కార్యక్రమాన్ని సొంత నిధులతో అమలు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమ్మధానం సర్పంచ్ గోదుల లత కిరణ్ కుమార్ గౌడ్,ఉపసర్పంచ్ పెద్ధింటి జగన్నాథ్,కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్,పోమాలపల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి,లింగం దాన సర్పంచ్ నాగిళ్ల వెంకటేష్,మెల్లగూడ సర్పంచ్ మంగారవి నాయక్,మాజీ సర్పంచులు నర్సిములు,చక్కటి వెంకటేష్ యాదవ్,తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి,శేఖర్ పంతులు,యారం శేఖర్ రెడ్డి,కమ్మదానం గ్రామకమిటి అధ్యక్షులు శివగాళ్ల రాజు,వార్డు మెంబెర్స్ గులాబ్ శ్రీను,గడ్డమీది లక్ష్మి చెన్నయ్య గౌడ్,సిరిగిరి కవితవెంకటేష్ గౌడ్,చించేటి శేఖర్,కార్కొండ సత్యం,యేన్నెం నారాయణ్ రెడ్డి,శివగాళ్ల ఉమా వెంకటేష్,పెద్దింటి మహేష్, భార్గవి భాను ప్రకాష్ గౌడ్,బీఆర్ఎస్ నాయకులు రాఘవేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి,నిజమోదిన్,శ్రీకాంత్ రెడ్డి,బాల్వంత్ రెడ్డి,హన్మంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,జోగామ్మాగూడం నర్సిములు,అంజి,బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper