లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిధుల మంజూరు హర్షణీయం
భూసేకరణ పూర్తి చేసి పనులు త్వరగా ప్రారంభించాలి
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఏఐఎస్ఎఫ్ తరపున విప్లవ వందనాలు
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఆకాష్ నాయక్
( పయనించే సూర్యుడు జూన్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)దశాబ్దాలుగా మన ప్రాంత రైతాంగం కంటున్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కలను సాకారం చేస్తూ, భూసేకరణ కొరకు ఏకంగా రూ. 587 కోట్లు మంజూరు చేయించిన షాద్నగర్ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న రిజర్వేర్ సాధన చేసి చూపించారు” అని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ఆకాష్ నాయక్ కొనియాడారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు శంకరన్నకు అఖిల భారత విద్యార్థి సమైక్య తరపున హృదయపూర్వక విప్లవ వందనాలు తెలియజేశారు. మాట ఇస్తే తప్పని శంకరన్న గత పదేళ్ల కాలంలో ఎంతో మంది సీనియర్ నాయకుల వల్ల కాని పనిని, కొత్తగా ఎమ్మెల్యేగా అడుగుపెట్టినప్పటికీ శంకరన్న తన పట్టుదలతో సాధించి చూపించారని ఆకాష్ నాయక్ ప్రశంసించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన, చిట్టచివరి ప్రాజెక్టు అయిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, ప్రభుత్వాన్ని పట్టుబట్టి ఒప్పించి రూ. 587 కోట్లు సాధించడం శంకరన్న అకుంఠిత దీక్షకు నిదర్శనమన్నారు.రైతుల పక్షపాతి శంకరన్న నియోజకవర్గ ప్రజల మీద, రైతుల మీద ఉన్న ప్రేమతోనే శంకరన్న ఈ అద్భుతాన్ని సృష్టించారని, ఈ నిధుల వల్ల ఇక్కడి గిరిజన తండాల వలసల కన్నీళ్లకు త్వరలోనే ముగింపు పడబోతుందని హర్షం వ్యక్తం చేశారు.