కరాటే గ్రేడింగ్ టెస్ట్ లో సత్తా చాటిన విద్యార్థులు

September 20, 2026 | తెలంగాణ

యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో గ్రేడింగ్ టెస్ట్

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతగట్టు తండకు చెందిన కరాటే విద్యార్థులు ఆదివారం షాద్ నగర్ పట్టణంలోని రామకృష్ణ థియేటర్లో జరిగిన కరాటే గ్రేడింగ్ టెస్ట్ లో పాల్గొని వివిధ రకాల బెల్టులు సాధించడం జరిగింది. యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ పర్యవేక్షణలో జరిగిన గ్రేడింగ్ టెస్ట్ లో కాటస్ కుమితే వెపేన్ విభాగాల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. బెల్టులు సాధించిన విద్యార్థులకు తాండ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ ఉత్తేజ్ మాస్టర్ పిరు మాస్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper