కళంగి నదిలో ఇసుక దందా.. అధికారుల అడ్డుకట్టకూ లెక్కలేదా?

August 30, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు ఆగస్టు 31 ( సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం
నాదన్లవారి కండ్రిగ గ్రామ పరిధిలోని కాళంగి నదిలో ఇసుక తరలింపు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారంటూ గ్రామస్తులు నిన్న ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు.గ్రామస్తుల ఫిర్యాదుతో స్పందించిన వీఆర్వో కా ళంగి నది వద్దకు చేరుకుని ఇసుక తరలింపును అడ్డుకునేలా చర్యలు చేపట్టారు.
అయితే అధికారుల అడ్డుకట్ట తర్వాత కూడా రాత్రివేళల్లో ఇసుక తరలింపు కొనసాగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అర్ధరాత్రి నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు అడ్డుకున్నా మళ్లీ అదే తరహాలో ఇసుక రవాణా కొనసాగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
దీంతో గ్రామస్తులు వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.ఫిర్యాదుపై పోలీసులు తక్షణమే స్పందించి గ్రామానికి చేరుకుని ఇసుక తరలింపును నిలిపివేయించినట్లు గ్రామస్తులు తెలిపారు.అధికారులు, పోలీసులు స్పందించినప్పుడే ఇసుక తరలింపు ఆగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై, వాహనాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కేవలం వాహనాలను ఆపివేయడం కాకుండా ఇసుక తరలింపు వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.రాత్రివేళల్లో జరుగుతున్న ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.కళంగి నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిగితే భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే నీటి లభ్యతపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇసుక తవ్వకాలు కొనసాగితే వ్యవసాయంపై మరింత ప్రభావం పడుతుందని రైతులు చెబుతున్నారు.అధికారుల హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా తరలింపు కొనసాగుతున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.ఇసుక రవాణాకు సంబంధించి అనుమతులు ఉన్నాయా? లేక అక్రమంగా తరలిస్తున్నారా? అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుని కాళoగి నదిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రభుత్వ సహజ వనరులను యథేచ్ఛగా తరలిస్తే భవిష్యత్తులో పర్యావరణంతో పాటు రైతుల జీవనాధారంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇకపై రాత్రివేళల్లో ఇసుక తరలింపునకు అవకాశం లేకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.కాళoగి నదిలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper