రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్య వేదిక సహాధ్యక్షుడు డాక్టర్ పి నాగిరెడ్డి

August 30, 2026 | సినిమా వార్తలు

రిజర్వేషన్ల కోసం సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు రెడ్డి సామాజిక వర్గం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ రంగాల్లో తమ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని నాయకులు పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే నిరసన దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రెడ్డి సామాజిక వర్గం ఐక్యంగా ఉండాలని, ఒకరికొకరు అండగా నిలుస్తూ పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని నాయకులు కోరారు. రిజర్వేషన్లకు సంబంధించిన తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహించనున్న నిరసన దీక్షకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 8వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న రెడ్ల నిరసన దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను పలువురు ముఖ్య నాయకులు విడుదల చేశారు. తమ తమ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను సమీకరించి దీక్షను విజయవంతం చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం జరిగే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

🌐 Select Language:
📰 ePaper