PS Telugu News
Epaper

కామోల్‌లో ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్త కార్యక్రమం.

📅 25 Mar 2026 ⏱️ 6:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

భక్తి ఉత్సాహంతో మారుమోగిన గ్రామం నిర్మల్ జిల్లా కామోల్ గ్రామం

అఖండ హరినామ సప్త మహోత్సవం భక్తి పరవశంలో ఘనంగా ముగిసింది. వారం రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావంతో పాల్గొన్నారు.సప్త ముగింపు సందర్భంగా గ్రామంలో పల్లకి ఊరేగింపు వైభవంగా జరిగింది. దేవుని విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ గ్రామ వీధులంతా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు పట్టి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. భజన మండలి సభ్యులు భక్తి గీతాలు ఆలపిస్తూ, సత్యనామాలు చేస్తూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. “జై శ్రీరామ్”, “జై పాండురంగ” నినాదాలతో గ్రామమంతా మారుమోగింది.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఐక్యత, భక్తి, ఆధ్యాత్మికత పెంపొందిందని పెద్దలు పేర్కొన్నారు. చివరిగా మహాప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

Scroll to Top