కార్మిక,కర్షక పోరాటాలతో కేంద్రం మెడలు వంచుదాం-. క్విట్ ఇండియా స్పూర్తితో హక్కుల కోసం పోరాడుదాం..
పయనించే సూర్యుడుD.10.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. టియుసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్ రమేష్
కార్మిక,కర్షక పోరాటాలతో కేంద్రం మెడలు వంచుదామని, క్విట్ ఇండియా స్పూర్తితో హక్కుల కోసం పోరాడుదామని ట్రేడ్ *యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసీఐ) జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్ రమేష్ పిలుపును ఇచ్చారు.నేడు దేశావ్యాప్తంగా ఎస్ కే ఎం, కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన ” జైల్ భరో ” కార్యక్రమం లో భాగంగా సిరికొండలో సోమవారం నాడు అంగడి బజార్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి నిరసన తెలిపారు.ఈ సందర్బంగా యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసీఐ) జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతు:దేశంలో అధికారంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ సర్కార్ స్వదేశీ కార్పొరేట్ కి విదేశీ బహుళ జాతి కంపెనీలకు గులాం గిరి చేస్తూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న విధానానికి నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలన్నారు.కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి రైతాంగాన్ని రోడ్డుపాలు చేయడానికి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతో కుట్రలు చేస్తుందని విమర్శించారు.స్వదేశీ కార్పొరేట్ శక్తులను వ్యవసాయ రంగంలోకి చొప్పించడానికి పూనుకుందని వారు విమర్శించారు.
విదేశీ బహుళ జాతి కంపెనీలను దేశంలో రప్పించడానికి కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడు లను తీసుకొచ్చి కార్మికులకు హక్కులు లేకుండా చేశారని వారు విమర్శించారు.గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దుచేసి జిరాంజీ అని కొత్త పేరుతో పథకం తీసుకొచ్చి వ్యవసాయ కార్మికుల సంక్షేమం నుండి పక్కకు తప్పుకోవాలని చూస్తుందని వారు అన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో విద్యుత్ సవర్ణ చట్టం పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి ప్రజల పైన రైతాంగం పైన తీవ్ర బారాలు మోపుతుందని వారు పేర్కొన్నారు.అటవీ హక్కుల చట్టం 2006 ఉన్నప్పటికీ దాని స్థానంలో అటవీ పరిరక్షణ యాక్ట్ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి పోడు భూములను కాజేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుందని వారు పేర్కొన్నారు.విదేశీ వ్యవసాయ ఉత్పత్తులను మన దేశంలోకి కారు చవకగా దిగుమతి చేసుకొని దేశంలో పండుతున్న పంటలకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాలి అని పిలుపును ఇచ్చారు.ఈ కార్యక్రమంలో , , AIUKS జిల్లా ప్రధాన కార్యదర్శి బి బాబన్న, కార్యదర్శి ఆర్ దామోదర్, కోశాధికారి ఎం లింబాద్రి, AIPKMS జిల్లా ప్రధానకార్యదర్శి ఇ రమేష్, కార్యదర్శి ఎం సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు బి కిశోర్, కోశాధికారి ఎస్ కిషోర్, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల నాయకులు గ్యామ గంగారాం, పీ ఎల్లయ్య, జి రాజు, ఎం పండరి, బి సర్పంచ్, పివైఎల్ రాష్ట్ర నాయకులు కే ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.