ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జంపన సుమన్ వర్మ
పయ నించే సూర్యుడు ఆగస్టు 10, 2026 అమలాపురం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బూత్ నెంబర్ 192 భట్టుపాలెం గ్రామంలో సోమవారం ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్ నెంబర్ 39 ఇంచార్జ్ జంపన సుమన్ వర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్ నెంబర్ 40 ఇంచార్జ్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, భీమనపల్లి సొసైటీ ప్రెసిడెంట్ ఆకేటి పెద్ద పాల్గొని ఇంటింటా ప్రచారంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే “మై టీడీపీ” యాప్లో ప్రజలను నమోదు చేయించారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలు, అవసరాలను తెలుసుకుని, ప్రభుత్వ కార్యక్రమాలపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మంచేం బుజ్జి, బూత్ కన్వీనర్ ఆకుల కృష్ణమోహన్, కో-కన్వీనర్ అడపా అవినాష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.