భాణాపురంలో శ్రీశ్రీశ్రీ విజయదుర్గాదేవికి ఘనంగా ఆషాడ సారె*

August 9, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు ఆగస్టు 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం భాణాపురం జి.ఎం.సి బాలయోగి కాలనీలోని శ్రీశ్రీశ్రీ విజయదుర్గాదేవి గ్రామదేవత ఆలయానికి ఆదివారం ఆషాడ మాస సారె గ్రామోత్సవంగా బయల్దేరి మహిళా మాతలు, మాతృమూర్తులు మేళతాళాలతో పసుపు, కుంకుమ, పూలు, పళ్లు, చలిమిడి, పానకం, వడపప్పు, వివిధ పిండి వంటలు అమ్మవారికి సమర్పించి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవు రాంబాబు, నేదునూరి త్రిమూర్తులు, కొర్లపాటి ప్రసాద్, వంగ వెంకటేశ్వరావు, కనకాల వీర వెంకట సత్యనారాయణ, పంపాని సత్యనారాయణ, దంగేటి సత్యనారాయణ తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

🌐 Select Language:
📰 ePaper