కాల్వ బజార్ రోడ్డు వివాదం పరిష్కారం
.వివాద పరిష్కారానికి కృషి చేసిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్*
పయనించే సూర్యుడు, జూన్ 12, అశ్వాపురం: అశ్వాపురం పంచాయితీ లో గల కాలువ బజార్ రోడ్డు విషయంలో గత కొద్ది ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది ఇరుకు దారి ఉండటంతో గ్రామపంచాయతీ పాలక వర్గాలు రోడ్డు వేయలేక పోతున్నవి చివరకు పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ వెళ్లగా అధికారులు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడి వివాద పరిష్కారానికి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ కు అప్ప చెప్పగా వారు స్థల యజమాని తో మాట్లాడి ఇరు వర్గాల మధ్య వివాద పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు ఫలించి స్థల యజమాని స్థలాన్ని ఇవ్వటానికి ముందుకు రావడంతో వివాదం ముగిసినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు సదర్ లాల్, ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు, గ్రామ కార్యదర్శి యాకూబ్ మరియు గ్రామ పెద్దలు, కల్వబజార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.