కాశిరెడ్డి గూడలో సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ రామలింగం గౌడ్

June 13, 2026 | తెలంగాణ

పది లక్షలతొ సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

( పయనించే సూర్యుడు జూన్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)ఫరూఖ్నగర్ మండలం కాశిరెడ్డి గుడా గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్ ఆధ్వర్యంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. దాదాపు పది లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం జరిగింది. భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.అనంతరం సర్పంచ్ రామలింగం గౌడ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు మరియు గ్రామ అభివృద్ధి తమ ముఖ్య లక్ష్యం అని అన్నారు. గ్రామంలోని ప్రతి రోడ్డు మరియు ఇతర ఈ సమస్యలైనా సత్వరమే పరిష్కరించే విధంగా గ్రామ అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటానని చేసే పనులను కూడా నాణ్యమైన పనులుగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్ మరియు ఉప సర్పంచ్ శ్రీశైలం మరియు వార్డు సభ్యులు మాజీ సర్పంచ్ దీన శంకర్ మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper