గత పన్నెండేళ్ల సుదీర్ఘ పాలనలో ఎక్కడా చిన్న మచ్చ కూడా లేకుండా, యావత్ భారత జాతి గర్వంతో తలెత్తుకునేలా చేసిన మహానాయకుడని నరేంద్ర మోదీ

June 13, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: మోదీ 12 సంవత్సరాల పాలన గురించి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామ రావు పటేల్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ కొనియాడారు .*శనివారం కడెం మండలంలోని కొండూకూరు ఎస్ కే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మోదీ 12 పాలనపై నిర్మల్ జిల్లా ప్రతినిధుల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై, మాట్లాడారు.*🪷 సాధారణంగా ఏ నాయకుడికైనా, ఏ ప్రభుత్వానికైనా రెండు మూడేళ్లకే ప్రజల్లో వ్యతిరేకత రావడం మనం చూస్తుంటాం. కానీ ఒక నిఖార్సైన, స్థిరమైన, ప్రజానుకూల ప్రభుత్వాన్ని అందిస్తూ… అత్యధిక కాలం ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న నంబర్ వన్ ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు.పరిపాలన అంటే కేవలం అభివృద్ధి, బడ్జెట్లు, అప్పులు, లెక్కలు మాత్రమే కాదు… భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ప్రజల విశ్వాసాలను ప్రపంచ నలుమూలలా సగర్వంగా చాటిచెప్పిన ఏకైక నాయకుడు మన మోదీ దశాబ్దాల కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను బద్దలుకొట్టి, 140 కోట్ల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక నాయకుడు ప్రధాని మోదీ.* ⏳ ‘చాయ్ వాలా’ స్థాయి నుంచి దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగి 12 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవ పూర్తిచేసుకున్న ఆ కర్మయోగికి.. 2029లో నాలుగోసారి అధికార పీఠం దక్కడం తథ్యం.భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక కాంగ్రెసేతర ప్రధాని 12 ఏళ్ల పాటు దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యంత సమర్థవంతమైన, నీతివంతమైన పాలనను అందిస్తున్నారు. ఆయనే మన శ్రీ నరేంద్ర మోదీ దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలకు ఆయన తన పాలనలో శాశ్వత పరిష్కారం చూపారు.ఆర్టికల్ 370 రద్దు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం, అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం, ముస్లిం మహిళలకు విముక్తి కల్పించే ట్రిపుల్ తలాక్ రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ గతిని మార్చారు.*తాను ప్రధానమంత్రిని కాదు, ఒక ప్రధాన సేవకుడిని అని చెప్పడమే కాదు, చేతల్లో నిరూపించిన గొప్ప నాయకుడు ఆయన. ఆదివారం, పండగ, పుట్టినరోజు అని ఏమాత్రం తేడా లేకుండా గడిచిన 12 ఏళ్లలో ఆయన తన కోసం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.అనారోగ్యం పాలైనా, చివరకు కన్నతల్లి దూరమైన తీవ్ర విషాదంలోనూ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ రోజు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసిన నిస్వార్థ నాయకుడు మోదీ .ప్రతిపక్షాలు ఆయనపై ఎన్నెన్నో విమర్శలు చేయొచ్చు. కానీ, గడిచిన పన్నెండేళ్ల మోదీ గారి పాలనలో ఆయనపై గానీ, కేంద్ర మంత్రులపై గానీ ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ కూడా లేకపోవడమే ఈ ప్రభుత్వ నిజాయితీకి, చిత్తశుద్ధికి అతిపెద్ద నిదర్శనం.ఇది మన దేశ ప్రజలందరికీ గర్వకరాణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, ఆకుల శ్రీనివాస్,రాజు యాదవ్,యాతాళం చిన్నరెడ్డి, రవీందర్ రెడ్డి, సత్యం చంద్రకాంత్, బుర్ర రమేష్, శారద,అంకం మహేందర్, నల్లా రమేష్, తాడేవర్ సాయినాథ్, జిల్లా లోని మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper