కుంటాల మండల కేంద్రంలో మూతపడిన ఎస్సీ సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని వెంటనే పునఃప్రారంభించాలి _చాత్రా యువ సంఘర్ష సమితి ( సి వై ఎస్ ఎస్) నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతల్కర్ అరవింద్…

June 27, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో గతంలో విజయవంతంగా నిర్వహించబడిన ఎస్సీ సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని కొన్ని అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్త వైఖరి కారణంగా మూసివేయడం అత్యంత బాధాకరమని ఛాత్ర యువ సంఘర్ష సమితి (సి వై ఎస్ ఎస్) నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతల్కర్ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు కుంటాల మండల కేంద్రంలో ప్రభుత్వ మోడల్ స్కూల్‌తో పాటు పలు విద్యాసంస్థలు ఉండటంతో ప్రతి సంవత్సరం వందలాది మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యాభ్యాసం కోసం ఇక్కడికి వస్తున్నారు. అయితే ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టల్ మూతపడటం వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి సౌకర్యాలు లేక అనేక మంది విద్యార్థులు చదువును మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది ప్రస్తుతం మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్‌లో సీట్లు పూర్తిగా నిండిపోయాయి అని అధికారులు చెబుతున్నారు దాదాపు 100 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండటంతో మిగిలిన విద్యార్థులు వసతి కోసం అల్లాడుతున్నారు దీంతో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల విద్య హక్కు ప్రమాదంలో పడుతోంది గతంలో సక్రమంగా నడిచిన ఎస్సీ సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని “విద్యార్థులు రావడం లేదనే” సాకుతో మూసివేయడం పూర్తిగా వాస్తవ విరుద్ధం హాస్టల్ నిర్వహణలో అధికారులు చూపిన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కారణాలు చూపడం సమంజసం కాదు. నేడు వసతి గృహం ఉంటే వందలాది మంది విద్యార్థులు దాని ద్వారా ప్రయోజనం పొందే పరిస్థితి ఉంది.అందువల్ల జిల్లా కలెక్టర్ గారు, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు వెంటనే స్పందించి కుంటాల మండల కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని పునఃప్రారంభించాలి. అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి.
లేనిపక్షంలో ఛాత్ర యువ సంఘర్ష సమితి (సి వై ఎస్ ఎస్) ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము. పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేస్తున్నాము. – శీతల్కర్ అరవింద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాత్ర యువ సంఘర్ష సమితి (సి వై ఎస్ ఎస్) నిర్మల్ జిల్లా…

🌐 Select Language:
📰 ePaper