PS Telugu News
Epaper

కుమ్మెర గ్రామ బిసిలపై దాడిని ఖండించిన బిఎస్పీ!!

📅 23 Feb 2026 ⏱️ 7:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి

అడ్వకేట్ జగన్ మోహన్ బిఎస్పీ నిర్మల్ జిల్లా అద్యక్షులు

ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో బహుజనుల ప్రాణాలకు రక్షణ లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ విమర్శించారు.కుమ్మెర గ్రామ బిసిలపై దాడిని తీవ్రంగా దండించిన బిఎస్పీ.ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మూడు నెలల బీసీ చాకలి బిడ్డ ప్రాణాలు బలిగొన్న ఆధిపత్య వర్గాల వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..రాష్ట్ర హోమ్ శాఖను తన వద్దే పెట్టుకొని పరిపాలన గాలికి వదిలివేశారని, ఇందిరమ్మ రాజ్యము అంటే ఇదేనా!!అని ఆందోళన వ్యక్తం చేశారు,పసి పాప అని కూడా చూడకుండ చంపిన కుల దురహంకారులను,కుల ఉన్మాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో బహుజన కులాల వ్యక్తులపై దాడులు,దౌర్జన్యాలు జరుగుతుంటే ఏం చేస్తున్నాడని నిర్మల్ జిల్లా అద్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ ప్రశ్నించారు.బాధిత కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు,బాదిత కుటుంబానికి రక్షణ కల్పించాలి అని జగన్ మోహన్ డిమాండ్ చేశారు.
రాబోయే రోజుల్లో బహుజన సమాజం రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఏకంమై అధికారం చేపట్టాలని, రాజ్యదికారం లేని జాతులపై దాడులు, అత్యాచారాలు జరుగుతాయని,అధికారం లేని జాతులు అంతరించి పోతాయని మహనీయులు డా.అంబేద్కర్,మాన్య శ్రీ కాన్షీరాం అన్నారని,వారి ఆలోచన విధానంలో అన్ని సమస్యల పరిష్కారానికి అధికారమే ప్రత్యామ్నాయం అని అన్నారు,రాజ్యాధికారం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా మహిల ఇంచార్జ్ లక్ష్మీ యాదవ్,ఖానాపూర్ అద్యక్షులు కోక్కరకారి రాజేష్,ఇంచార్జ్ జోసఫ్ గంగారాం,ప్రదాన కార్యదర్షి సంజయ్,నాయకులు బాబు,ఇర్పాన్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top