కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై గర్జించిన ముమ్మడివరం లో విజయవంతమైన భారీ బైక్ ర్యాలీ
పయనించే సూర్యుడు జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి**కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ రెండేళ్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు చేసిన అన్యాయాలను మరియు ‘వెన్నుపోటు’ను నిరసిస్తూ… రాష్ట్ర వైయస్సార్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సి ఇ సి) సభ్యులు పితాని బాలకృష్ణ& మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన “భారీ బైక్ ర్యాలీ” కార్యక్రమం విజయవంతం అయ్యింది.రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వారు పిలుపుమేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన తరుణంలో ప్రజలకు మోసపూరిత హామీ ఇచ్చిన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కార్యక్రమాన్ని చేపట్టింది. వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజీ దగ్గర వై జంక్షన్ నుండి బొండాయకొడు తూము వై జంక్షన్ వరకు జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి పొన్నాడ సతీష్ కుమార్ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సిఇసి) సభ్యులు పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో అండగా ఉంటానని అన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనం అందరం పార్టీని పూర్తిస్థాయిలో బలోపితం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని సమయుక్తులై సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్సార్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు వివిధ అనుబంధ కమిటీల సభ్యులు జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు గ్రామస్థాయి వివిధ విభాగాల అనుబంధ కమిటీ నాయకులు మహిళా నాయకులు అభిమానులునాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.