PS Telugu News
Epaper

కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో పిఎంజెజెబివై రెండు లక్షలు ఆర్థిక భరోసా

📅 14 Feb 2026 ⏱️ 1:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్‌ దాసు)

సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు న్యూకాలనీలో మాదరపాకం చరణ్ కుమార్ ఆరోగ్యం సరిలేనందిన మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పిఎంజెజెబివై యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. పిఎంజెజెబివై ద్వారా 2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎంజెజెబివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును అతని భార్య ప్రియాంక కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మన్నారుపోలూరు బ్రాంచ్ మేనేజర్ ఉమా మహేశ్వరి మాట్లాడుతూ పిఎంజెజెబివై మరియు పిఎంఎస్ బి వై అందరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియ చేయడం జరిగింది. పై కార్యక్రమంలో మన్నారుపోలూరు కెనరా బ్యాంక్ మేనేజర్ ఉమా మహేశ్వరి, కెనరా బ్యాంక్ ఆఫీసర్ నాగ రాజేశ్వరయ్య, క్లర్క్ కృష్ణ మూర్తి, హేమసుందర్, సూళ్లూరుపేట మెప్మా సి.ఓ. ప్రభాకర్,సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం పాల్గొనడం జగిరింది.

Scroll to Top