కోల్పూర్ లో డబ్ల్యూ డిసి సెంటర్లో MJPVC ఆధ్వర్యంలో నిర్వహించిన చలివేంద్ర కార్యక్రమం విజయవంతం కెవి నరసింహ

June 23, 2026 | తెలంగాణ

:పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 24: కొల్పూరు గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కోల్పూర్ గ్రామపంచాయతీలో డబ్ల్యూ డి సి ఉమెన్ డెవలప్మెంట్ సెంటర్ కుట్టుమిషన్ కేంద్రంలో MJPVC ఆధ్వర్యంలో గత ఏప్రిల్ నెలలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంద్ర కేంద్రం నాటి నుండి నేటి వరకు దాదాపుగా 60 రోజులు అంటే రెండు నెలలు నిర్వీర్యంలో కార్యక్రమాన్ని నిరంతరం చలివేంద్రంలో రోజు 30 లీటర్ల నీటిని MJPVC సంఘం నాయకులు అందివ్వడం జరిగింది ఇలా 60 రోజులు 60×30=1800 లీటర్ ల నీటిని MJPVC సంఘం వారు అందించారు ఆ సంఘం వ్యవస్థపాక అధ్యక్షులు కెవి నరసింహ తెలిపారు అలాగే ఉమేన్ డెవలప్ మెంట్ సెంటర్ కుట్టుమిషన్ ట్రైనర్ టీచర్ మహాదేవి మాట్లాడుతూ మా సెంటర్కు నీటి కొరత లేకుండా రెండు నెలలు నిరంతరం నీటిని చలివేంద్రం ద్వారా అందించిన MJPVC సంఘానికి మా సెంటర్ ద్వారా ప్రత్యేక అభినందనలు అలాగే ఇలాంటి కార్యక్రమలు ఎన్నో చేయాలి అని కోరుతున్నాను అన్నారు అలాగే సెంటర్ శిరీష మాట్లాడుతూ మా సెంటర్ కు చలివేంద్రం ద్వారా నీరు అందించిన MJPVC సంఘానికి ప్రత్యేక దన్యవాదములు అన్నారు ఈ కార్యక్రమంలో కెవి నరసింహ ముద్దు నవ్య శ్రీ గణేష్ శేఖర్ శ్రీమను లడ్డు నిమ్మమ్మ శిరీష అనేక మంది W D C సెంటర్ మహిళలు పాల్గొని MJPVC విజయవంతం అయినా రెండు నెలలు ముగిసిన చలివేంద్రం కార్యక్రమంలో కార్యక్రమం విజవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper