ఎదుటి వారిపై అనుచిత వ్యాఖ్యలు వదిలేసి అభివృద్ధికి కృషి చేయండి

June 23, 2026 | తెలంగాణ

-జనసేన పార్టీ నారాయణపేట జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్

:పయనించే సూర్యుడు జూన్ 24మక్తల్ : పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తేనే తమ అస్తిత్వం కోల్పోతామన్న భయంతో కొందరు నాయకులు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని జనసేన పార్టీ నారాయణపేట జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణ కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ జిల్లా నాయకులు గుడిసె నరసింహ మరియు ఇతర నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సూర్యాపేట మీదుగా వెళ్తున్న సందర్భంలో ఆయన జన సైనికులకు, అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లడం జరిగింది ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన జనసైనికులను అభిమానులను చూసి మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అస్తిత్వం కోల్పోతామన్న భయంతో వారి ప్రాంతంలో అభివృద్ధిని పట్టించుకోకుండా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే గొప్పవారిమవుతామన్న వారి దుర్బుద్ధిని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తనను ఎన్నుకున్న సూర్యాపేట ప్రజలకు సేవ చేయడం మరిచిపోయి నేటి యువతరానికి రాజకీయ భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకోవడం సిగ్గుచేటు అని ఇకపై తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై నోరు జారితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక గత పది ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో తండ్రి కెసిఆర్ తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన మహిళా నాయకురాలు కవిత. ఆస్తి పంపకాల కారణంగా టిఆర్ఎస్ పార్టీని స్థాపించి తాను గత పది ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజలకు చేసిన అన్యాయాన్ని మర్చిపోయి టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రజలను మభ్యపెడుతున్నది అందరూ గమనిస్తున్నారని, పార్టీ స్థాపించి ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి కానీ అది వదిలేసి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వేకలు చేయడం ఆమె రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కవిత. బిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని ప్రజలకు చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు అదే పార్టీలో ఉన్న మీరు ప్రజలకు ఏం చేశారన్నది చెప్పాలన్నారు. ఇవన్నీ వదిలేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రశ్నించేందుకు జనసైనికులను సిద్ధం చేస్తున్న తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఆయన ఘాటుగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా మారబోతుందన్న భయంతో తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేతగాని వ్యాఖ్యలుగా చూస్తున్నారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన జనసేన పార్టీలోకి వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున చేరికలుకొనసాగుతున్నాయని, రాబోయే రోజుల్లో గల్లి నుండి రాష్ట్ర గడ్డపై జనసేన పార్టీ జెండా రెపరెపలాడబోతుందన్నారు. కాబట్టి నాయకులారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుందో లేదో అన్నదానిపై దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఆయన అన్నారు.ఈ మీడియా సమావేశం లో కొడంగల్ జనసేన నాయకులు అరుణ్ కుమార్ గౌడ్ అశోక్ కుమార్ మరియు నారాయణపేట నాయకులు వెంకీటేష్. క్రిష్ణ. నరేష్. మక్తల్ నాయకులు హనుమంతు. రామన్ గౌడ్ .గౌడి బాలు రెడ్డి వీరేష్ భీమేష్. కావాలి ప్రవీణ్ కమ్మరి శ్రీను. పరుశురాం. తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper