గంజాయి పైన అలుపెరుగని పోరాటం చేస్తున్న సూళ్ళూరుపేట సిఐ ఎం.మురళీకృష్ణ

July 8, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూలై 8 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలు, నాయుడుపేట డిఎస్పీ చెంచు బాబు పర్యవేక్షణలో సూళ్ళూరుపేట సిఐ ఎం.మురళీకృష్ణ మాదకద్రవ్యాల నివారణలో తనదైన ముద్ర వేస్తున్నారు. గంజాయిని నిర్మూలిద్దాం lమాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం” అనే లక్ష్యంతో సిఐ మురళీకృష్ణ క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు మరియు మెరుపు దాడులను ముమ్మరం చేశారు.​ఇందులో భాగంగా మంబట్టు సెజ్ ప్రాంతంలో సిఐ మురళీకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు నిర్వహించారు. తడ ఎస్సై కె.కొండప్ప నాయుడు బృందంతో కలిసి గంజాయిని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో ఉంటూ, అక్రమ రవాణాపై సిఐ చేస్తున్న నిరంతర నిఘా మాదకద్రవ్యాల అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తూ, ఎక్కడా చిన్న పొరపాటుకు తావులేకుండా సిఐ వ్యవహరిస్తున్న తీరుపై స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ​ఈ సందర్భంగా సిఐ ఎం.మురళీకృష్ణ మాట్లాడుతూ మాదకద్రవ్యాల మహమ్మారిని జిల్లా నుండి తరిమికొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం తనిఖీలు మాత్రమే కాకుండా, ప్రత్యేక అవగాహన బస్సు యాత్ర ద్వారా విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే వినాశకర పరిణామాలను వివరిస్తున్నామని తెలిపారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, గంజాయి రవాణా లేదా విక్రయాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వంటి కఠినమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. పోలీసుల సూచనలను పాటిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, గంజాయి కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, శాంతి భద్రతల పరిరక్షణలో సిఐ మురళీకృష్ణ చూపిస్తున్న చొరవ అభినందనీయం. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper