దీనబంధు కాలనీ చౌరస్తాలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు న్యూస్, జూలై 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని దీనబంధు కాలనీ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ఆయన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను స్మరించుకున్నారు. ముఖ్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం, ఉచిత వైద్య సేవలు, రైతులు, పేదల సంక్షేమానికి చేపట్టిన అనేక ప్రజాహిత కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాలనీలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.