డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులతో ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే పై సమావేశం.

July 8, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.8.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. ఈ రోజు బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆర్మూర్ ,బోధన్, బాల్కొండ ,నిజామాబాద్ రూరల్ ,బాన్సువాడ నియోజకవర్గల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.సమావేశంలో డిసిసి కార్యవర్గంలోని ఉపాధ్యక్షులకు,ప్రధాన కార్యదర్శులకు,కార్యదర్శులకు వివిధ మండలాలలో SIR ప్రక్రియ కొరకు బాధ్యులుగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వే కొనసాగుతున్న సందర్భంగా ప్రతి మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ తమ మండలాలలో సర్వే ప్రక్రియ 100% సక్రమంగా జరిగే విధంగా చూడాలని,ఏ ఒక్క ఓటు కూడా పోకుండా అందరూ ఎన్నిమరేషన్ ఫామ్ లు నింపే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి బూత్ లో ప్రజలకు ఎన్యూమరేషన్ ఫామ్ లో నింపడంలో బిఎల్ఎ సహాయ పడాలని, ఇబ్బందులు ఉన్న దగ్గర పార్టీ నుంచి ఒకరిని బిఎల్ఓ కు ఇచ్చి ఫారంలు నింపే విధంగా చూడాలని,ఈనెల 25వ తేదీ వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సర్వే ప్రక్రియలో చిత్తశుద్ధితో పాల్గొనాలని అన్నారు. ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా సర్వే పూర్తి అయ్యే విధంగా చూడాలని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను గ్రామాలలో సమావేశాలు నిర్వహిస్తూ నియమించాలని,సీనియర్ నాయకులను జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులను సమన్వయ పరుచుకొని మండల కమిటీలను నియమించాలని వెంటనే ఈ కార్యక్రమాలు చేయాలని నగేష్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లు త్వరగాకుండా చూసే బాధ్యత పూర్తిగా మండల అధ్యక్షుడు పైనే ఉంది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ,జిల్లా కోశాధికారి భక్తవస్తలం,డిసిసి ఉపాధ్యక్షులు తారా చాంద్,రత్నాకర్ గౌడ్, గోపి,రజిత యాదవ్,పాషా, అమృతాపూర్ గంగాధర్, బాలరాజు, చట్ల నరేష్, ముస్కు వెంకట రామ్ రెడీ,మేక వీర్రాజు,వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper