గట్స్ ఉన్న జర్నలిస్టు.. మనసున్న నా మిత్రుడు కేపీ..
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..
సీనియర్ జర్నలిస్టు కేపీ జన్మదిన వేడుకల కార్యక్రమం
శ్రీ సరస్వతి కళాపీఠం సభ్యులను సన్మానించిన ఎమ్మెల్యే శంకర్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
మంచి జర్నలిస్టుగా మాత్రమే కాకుండా మనసున్న వ్యక్తిగా, స్నేహితుడిగా కూడా జర్నలిస్ట్ కెపితో తనకు ఎంతో అనుబంధం ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కేపి దంపతుల జన్మదినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుగా నిరంతరం సమాజంతో పోరాడే కేపీ లాంటి వ్యక్తులు అవసరమని అన్నారు. వైద్య శాఖలో ఉండి నిరుపేదలకు సేవలు అందిస్తున్న ఆయన సతీమణి శ్యామల పాత్ర కూడా ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. చక్కని పాటలతో కనువిందు చేస్తున్న శ్రీ సరస్వతి కళా పీఠం నిర్వాహకులను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. జర్నలిస్ట్ కేపీతో తన రాజకీయ ప్రయాణం విజయవంతంగా కొనసాగిందని, ఇలాంటి వారితో సఖ్యతగా స్నేహంగా ఉండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి కళా పీఠం సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కళాకారులను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో కళాకారుల కోసం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
