PS Telugu News
Epaper

శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మహా యజ్ఞ కార్యక్రమాలు

📅 28 Apr 2026 ⏱️ 4:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి పరవశంతో కొనసాగుతున్న శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలోని మహా యజ్ఞ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గరుడ, హనుమద్ మూర్తుల స్థాపన ప్రయుక్త పాంచాహ్నిక అష్టకుండాత్మక శ్రీ రామాయణ మహా యజ్ఞంలో భాగంగా ఈరోజు నారసింహ ఇష్టి, నారసింహ మండల పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు ప్రత్యేకంగా పాల్గొని యజ్ఞంలో ఆహుతులు సమర్పించారు. వారి వెంట మాజీ చైర్మన్ శ్రీనివాసరావు (తులసి రావు) దంపతులు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు దంపతులు కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.వేద మంత్రోచ్చారణల మధ్య యజ్ఞశాలలో నిర్వహించిన పూజలు భక్తులను ఆకట్టుకోగా, దేవస్థానం ప్రాంగణం మొత్తం భక్తిజనాలతో కిటకిటలాడింది. ఈ మహా యజ్ఞం ద్వారా ప్రాంతంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతోందని, ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Scroll to Top