PS Telugu News
Epaper

గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలు సమర్పించాలి

📅 23 Feb 2026 ⏱️ 7:41 PM 📝 HOME
Listen to this article

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 23(పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం :రాష్ట్రంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి నది తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు మరియు సంబంధిత శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుష్కరాల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై పూర్తి స్థాయి ప్రణాళికతో నివేదికలు తయారు చేయాలని సూచించారు. పుష్కర స్నానానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, శుద్ధి చేసిన త్రాగునీటి సరఫరా, తాత్కాలిక వైద్య శిబిరాల ఏర్పాటు, అంబులెన్స్ సదుపాయం, గజ ఈతగాళ్ల నియామకం, బలమైన పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ మరియు వెలుగుల ఏర్పాట్లు తదితర అన్ని మౌలిక సదుపాయాల కల్పనపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.ముఖ్యంగా భద్రాచలంలో గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. భద్రాచలం గోదావరి తీరం వద్ద ఉన్న పుష్కర ఘాట్లను పరిశీలించి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలో గోదావరి పుష్కరాలు ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భద్రాచలం గోదావరి తీరంలో పుష్కర స్నానానికి సమీప జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందుకు అనుగుణంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో దామోదర్ రావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పంచాయతీ అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top