గ్రామీణాభివృద్ధికి వీబీజీ రామ్ జీ పథకం దోహదం

July 2, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు జూలై 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోనగ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభ కార్యక్రమం కాట్రేనికోన మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం వీబీజీ రామ్ జీ పథకం ప్రధాన లక్ష్యం అన్నారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పథకం ద్వారా అధిక ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు.కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. గ్రామాల స్వరూపం మార్చేందుకు ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.ఈ ఈ కార్యక్రమంలో ఎంపీడీ ఓ బి రాజేశ్వరరావు ,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, సీనియర్ నాయకులు మాజీ అగ్రికుల క్షత్రియ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు ముమ్మిడివరం మార్కెటింగ్ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, మండలి ఇంచార్జ్ దాట్ల పవన్, ఇసుక పట్ల వెంకటేశ్వరరావు ఆకాశపు శ్రీనివాస్ మిత్ర వెంకటరమణ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అధికారులు, మీడియా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper