గ్రామ సహాయకుల సమస్యల పరిష్కారానికి 7వ రోజు నిరసన

September 22, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధిగ్రామ సహాయకుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కల్పించాలని కోరుతూ 16-09-2026 నుంచి నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా 7వ రోజు 22-09-2026న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హైస్కూల్ కూడలిలో అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం మూడు మండలాల గ్రామ సహాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జీతభత్యాల పెంపు,వేతన శ్రేణి అమలు, పదోన్నతులు, వారసత్వ ప్రాతిపదికన నియామకం వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అలాగే అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ మధుర్ కు సమస్యలు వివరిస్తూ వినతిపత్రం అందజేసి,వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మొగలికుదురు లక్ష్మణరావు, సత్యనారాయణ, రంజీ, విజయ్,ప్రశాంత్,దుర్గ ప్రసాద్,మంగ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper