నిజామాబాద్ పట్టణంలో సెప్టెంబర్ 24 నుండి 26 వరకు గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ : పోలీస్ కమిషనర్ వెల్లడి
.పయనించే సూర్యుడుD.22.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.ఇందుమూలంగా నిజామాబాద్ పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా తేదీ 24-9-2026 నాడు ఉదయము 11 గంటల నుండి 26-09-2026 ఉదయం 11 వరకు పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉత్సవాలు జరుగుచున్నందున కొన్ని ప్రాంతాలలో వాహనాలను దారి మళ్లింపు (Traffic Diversion) చేయడమైనది.*హైదరాబాదు నుండి నిజామాబాద్ వచ్చే ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలు :* హైదరాబాదు నుంచి నిజామాబాద్ వచ్చి వెళ్లే వాహనాలు మరియు ఆర్టీసీ బస్సులు ముఖ్యంగా మాధవ నగర్ బైపాస్, కంటేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ గుండా ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవాలి.*బోధన్ వెళ్లే మరియు వచ్చే ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలు :* ముఖ్యంగా బోధన్ వచ్చి వెళ్లే వాహనాలు మరియు ఆర్టీసీ బస్సులు, అర్షపల్లి చౌరస్తాలో ఎడమవైపు తిరిగి, బైపాస్ గుండా ప్రయాణిస్తూ కొత్త కలెక్టరేట్, కంటేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా నుండి బస్టాండ్ చేరుకోవాలి మరియు తిరిగి ఇదే దారిలో బోధన్ కు వెళ్లాలి. *ఆర్మూర్ వైపు నుండి నిజామాబాద్ బస్టాండ్ మరియు ఇతర ప్రాంతాలకు వచ్చి వెళ్లే వాహనాలు :* ముఖ్యంగా ఆర్మూర్ వైపు నుండి నిజామాబాద్ బస్టాండు మరియు ఇతర ప్రాంతాలకు వచ్చి వెళ్లే వాహనాలు కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు చేరుకొని అక్కడి నుండి నేరుగా రైల్వే అండర్ పాస్ మరియు ఎన్టీఆర్ “టీ” జంక్షన్ వద్ద కుడి వైపుకు తిరిగి, రైల్వే స్టేషన్ ముందరి నుండి బస్టాండ్ చేరుకోవాలి మరియు ఇదే దారిని ఉపయోగిస్తూ ఆర్మూర్ వైపు తిరిగి వెళ్ళవచ్చు .*బాన్సువాడ మరియు వర్ని వైపు నుంచి వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలు:* ముఖ్యంగా బాన్సువాడ మరియు వర్ని వైపు నుండి వచ్చి తిరిగి వెళ్లే ఆర్టీసీ బస్సు మరియు ఇతర వాహనాలు నిజామాబాద్ లోని వర్ని చౌరస్తా వరకు చేరుకొని అక్కడి నుండి కుడి వైపుకు తిరిగి ఆర్.ఆర్ చౌరస్తా గుండా పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, కోర్ట్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ ముందర నుండి బస్టాండ్ చేరుకోవాలి మరియు ఇదే దారిని ఉపయోగించి తిరిగి వెళ్లాలి.*భారీ వాహనాలకు ముఖ్యమైన సూచన:* భారీ వాహనాలు ఎట్టి పరిస్థితిలో 24వ తారీకు ఉదయం 11 గంటల నుండి 26వ తారీకు ఉదయం 11 గంటల వరకు నగరంలో ప్రవేశించరాదు. *కంటేశ్వర్ రైల్వే అండర్ పాస్ ఎత్తు* ముఖ్యంగా రైల్వే అండర్ పాస్ యొక్క ఎత్తు రోడ్డు నుండి 13 ఫీట్లు ఉన్నందున, ఇట్టి విషయాన్ని గమనించి “13 ఫీట్ల లోపల” ఉండే గణపతి విగ్రహాలు మాత్రమే కంటేశ్వర్ రైల్వే అండర్ పాస్ ఉపయోగించాలని. *అదేవిధంగా 13 ఫీట్లు మించిన గణపతి విగ్రహాలు* 13 ఫీట్లు మించిన గణపతి విగ్రహాలు ముఖ్య శోభాయాత్ర అనగా రథము వెళ్ళిన తరువాత రైల్వే ఫ్లైఓవర్‌ను ఉపయోగించుకొని వెళ్లాలి.కావున నిజామాబాద్ పట్టణ ప్రజలు ఇట్టి విషయాన్ని గమనిస్తూ తమరి యొక్క ప్రయాణాలు కొనసాగించాలని * నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.,* వారి విజ్ఞప్తి.