సూళ్లూరుపేటలో ప్రోబుషన్& ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు లేరా?
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట, తడ దొరవారిసత్రం మండలంలోని వైన్ షాపుల్లో మద్యం బాటిల్ పై ఉన్న ఎం.ఆర్.పి రేట్లు కంటే అధిక ధరకు మద్యం విక్రాలు జోరుగా జరుగుతున్న పట్టించుకోని ఎక్సైజ్ శాఖ పోలీస్ అధికారులు. వైన్ షాపుల యజమానులు ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు పిచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. అయినా కూడా పట్టి పట్టినట్టు ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు, వైన్ షాపుల యాజమానులు ఎమ్మార్పీ రేట్ కంటే ₹10, ₹20 రూపాయలు అధిక ధరలకు విక్రస్తుంటే అసలు సూళ్లూరుపేట లో ఎక్సెస్ శాఖ డిపార్ట్మెంట్ ఉన్నట్టా లేనట్టా ప్రభుత్వానికి తెలియాలి వైన్ షాప్ లైసెన్సులన్నీ ఒక సంవత్సరం రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ఓవైపు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి మద్యంపై ఒక్క రూపాయి ఎంఆర్పి కంటే ఎక్కువగా తీసుకున్న ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అలా ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకున్న వారికి పది లక్షల జరిమానా షాప్ కు ఉన్న లైసెన్స్ రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి ఒక ప్రసంగంలో వాగ్దానం చేశారు కానీ సూళ్లూరుపేట లో ఉంటున్న వైన్ షాపులు ఎవరి మాటలని లెక్క చేయకుండా సిండికేట్ గా ఏర్పడిన లిక్కర్ మాఫియాని సాగిస్తున్నారు దీనికి ఎవరి ఎలా పోతే మాకెందుకు మేము అమ్మేది అంతే మమ్మల్ని అడిగేది ఎవరు ఆపేది ఎవరు? మేముచెప్పిందే చట్టం మేం చేసిందే అధికారం అనే విధంగా వైన్ షాపుల యజమానులు ఉన్నారు ఇకనైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకోవాల్సిన ప్రజలు కోరుకుంటున్నారు