PS Telugu News
Epaper

ఘనంగా ప్రపంచ ఆలోచన దినోత్సవం

📅 23 Feb 2026 ⏱️ 6:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ 23

యాడికి మండల కేంద్రం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల NO 4 ఆవరణం యందు స్కౌట్ వ్యవస్థాపకులు రాబర్ట్ బెడన్ పావెల్ మరియు వారి శ్రీమతి ఓలవీ బడెన్ పావెల్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 22 వ తేదీన ప్రపంచ ఆలోచన దినోత్సవం జరుపుకోవడం జరిగింది . ఈ సందర్భంగా కార్యక్రమము నకు ముఖ్య అతిథిగా హాజరు ఐన మండల విద్యాధికారి శ్రీ యం. కాశప్ప గారు మాట్లాడుతూ చిన్న వయసులోనే పిల్లల కు సేవాభావం, క్రమశిక్షణ, సహాయం చేసే మంచి లక్షణాలు అలవాటు చేయడము లో ఈ స్కౌట్ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్ లో ఈ స్కౌట్ కార్యక్రమం లకు తన వంతు పాఠశాల కు సహాయం చేస్తానని తెలియపరచి, స్కౌట్ మాస్టర్, మరియు పాఠశాల సిబ్బందికి అభినందనలు తెలిపారు, మరియు విశ్రాంత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు విజయమ్మ గారు స్కౌట్ యూనిట్ కి కొ ఏడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్ లో స్కౌట్ కార్యక్రమంలో భాగంగా ఏదైనా ఆర్థిక సహాయం అందించడానికి తన వంతు ఎల్లప్పుడూ ముందు ఉంటాను అని తెలిపారు.ఈ సందర్భంగా మేడమ్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో నే ఇటువంటి మంచి క్రమశిక్షణ కలిగిన స్కౌట్ గురించి తెలియపరచి ఆపద సమయంలోను, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సహాయ , సహకారాలు చేసే విధంగా చిన్న వయసులోనే ఆలోచన చేసే మంచి కార్యక్రమం స్కౌట్ అని కొనియాడారు. ఈ సందర్భంగా స్కౌట్యూనిట్ కి దాత ఐన విజయమ్మ గారిని పాఠశాల ఉపాద్యాయబృందము మరియు విద్యార్థులు ఘనంగా సన్మానం చేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, శైలజ కుమారి, రవీంద్ర, Flock leader వరలక్ష్మీ, పద్మావతి, రంగస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top