PS Telugu News
Epaper

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఏన్కూరు టిఆర్ఎస్ నాయకులు.

📅 24 Apr 2026 ⏱️ 1:35 PM 📝 HOME
Listen to this article

మదన్ లాల్ జ్ఞాపకార్ధంగా చలివేంద్రాన్ని ప్రారంభించారు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ; ఏన్కూరు: చలివేంద్రం ప్రారంభించిన మంజుల మదన్ లాల్ టిఆర్ఎస్ నాయకులు ఎండలు మండిపోతున్న వేళ బాటసారుల దాహార్తి తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం ఘనంగా ప్రారంభించారు చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం స్వీట్లు పంచారు స్వయంగా బాటసారులకు మజ్జిగ చల్లని నీరు అందించారు వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే మా లక్ష్యం ప్రతి ఒక్కరు దాహంతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసాం ఇది రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6:00 వరకు నిరంతరాయంగా సేవలు అందిస్తాము అని తెలిపారు చలివేంద్రంలో చల్లని మంచినీరు మజ్జిగ ఓఆర్ఎస్ ద్రావణం ఉచితంగా అందిస్తున్నాము వేసవి అంతా ఈ సేవలు కొనసాగుతాయని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు టిఆర్ఎస్ నాయకుల సేవా దృక్పథాన్ని ఏన్కూరు మండల ప్రజలు ఆటో డ్రైవర్లు ఉపాధి కూలీలు అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యువజన సంఘ సభ్యులు మహిళలు టిఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Scroll to Top