జాతీయ స్థాయి సేపక్ తక్రా పోటీలకు పోతంగల్ కలాన్ క్రీడాకారిణి
పయనించే సూర్యుడు గాంధారి 24/04/26
గాంధారి మండలలోని పోతంగల్ కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అబ్దుల్ అలియా నిత్యము ఉదయం మరియు సాయంత్రం పాఠశాల ఆవరణలో సేపక్ తక్రా నైపుణ్యాలను పట్టుదలతో నిరంతరం సాధన చేస్తూ జిల్లా జట్టు తరుపున ప్రాతినిత్యం వ్యవహరించి సేపక్ తక్రా క్రీడలో తనదైన ముద్ర వేసుకున్న అబ్దుల్ అలియా మహబూబాబాద్ జిల్లా లో జరిగిన S.G.F U/14 రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి సేపక్ తక్రా పోటీలకు ఎంపికైనట్లుపాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్రము లోని మహబూబాబాద్ లో ఈ నెల ఏప్రిల్ 24 నుండి 28 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుపున కెప్టెన్ గా వహిస్తుంది అని పాఠశాల ప్రాథనోపాధ్యాయులు G రంగారావు తెలిపారు విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామసర్పంచ్ అనుశ్రీ బాల్ రాజు ఉప సర్పంచ్ సంజీవ్ రెడ్డి గ్రామస్తులు యువకులు అభినందించారు.